The Desk ..Kaikaluru : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు తల్లి కొల్లేటి శ్రీ పెద్దింట్లమ్మ…శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయంలో 7వ రోజు వైభవంగా కొనసాగుతున్న జాతర మహోత్సవాలు

The Desk ..Kaikaluru : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు తల్లి కొల్లేటి శ్రీ పెద్దింట్లమ్మ…శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయంలో 7వ రోజు వైభవంగా కొనసాగుతున్న జాతర మహోత్సవాలు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వెలసిన శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో జాతర మహోత్సవాలు 7వ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. వార్షిక జాతరలో భాగంగా మంగళవారం ఉదయం 5 గంటలకు శ్రీ జలదుర్గ, పెద్దింట్లమ్మ అమ్మవారికి విశేషార్చనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన వస్త్రాలతో అలంకరణ, పంచామృత అభిషేకం, సుగంధ ద్రవ్యాభిషేకం, సహస్రనామ కుంకుమ పూజ, పుష్పార్చన, పుష్పాలంకరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ద్రవ్యోపచారాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాలభోగం, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలకు గ్రామానికి చెందిన పేగేశ్న ప్రసాద్ రాజు, వెంకటలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి, అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీ పెద్దింటి అమ్మవారికి, శ్రీ జలదుర్గ అమ్మవార్లకు పంచహారతులు, నైవేద్యం, నీరాజన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే రాత్రి 7 గంటలకు విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు దేవస్థాన ధర్మకర్తల మండలి పర్యవేక్షణలో నిర్వహించినట్లు ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు స్థానిక గ్రామస్థులు, రాష్ట్రం నలుమూల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు.