ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

మండలంలోని పందిరిపల్లిగూడెం పంచాయితీ కొల్లేటికోట గ్రామములో వేంచేసిఉన్న శ్రీశ్రీశ్రీ పెద్దింటి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవములు – 2026 సమన్వయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కామినేని ముందుగా శ్రీ జలదుర్గ సమేత శ్రీశ్రీశ్రీ పెద్దింటి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయ సమావేశంలో పాల్గొని అమ్మవారి ఉత్సవాల నిమిత్తం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆలయ EO తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 3వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. ఫిబ్రవరి 28వ తేదీ శ్రీ జలదుర్గమ్మకు శ్రీ గోకర్ణేశ్వర స్వామి వారికీ కళ్యాణం జరుతుందని తెలిపారు. MLA కామినేని ఉత్సవాలు చాలా పకడ్బందిగా నిర్వహించాలని.. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపించాలని దిశా నిర్దేశించారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, దేవస్థానం సిబ్బంది మరియు కమిటీ సభ్యులు, పలు లంక గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

