The Desk … Kaikaluru: కోడిపందేలు, పేకాటలకు దూరంగా ఉండాలి – కైకలూరు టౌన్ ఎస్‌ఐ వెంకట కుమార్

The Desk … Kaikaluru: కోడిపందేలు, పేకాటలకు దూరంగా ఉండాలి – కైకలూరు టౌన్ ఎస్‌ఐ వెంకట కుమార్

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాటలు, గుండాట వంటి జూద క్రీడలకు యువత దూరంగా ఉండాలని కైకలూరు టౌన్ ఎస్‌ఐ వెంకట కుమార్ సూచించారు. జిల్లా ఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్, ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో జూద క్రీడలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహిస్తూ పండుగలను జరుపుకోవాలని సూచించారు. జూద క్రీడల వల్ల కుటుంబాలు, సమాజం నష్టపోతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.