ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు పట్టణంలో వేంచేసి ఉన్న ప్రజల ఇలవేల్పు, కోరిన వరాలిచ్చే కొంగుబంగారంలా విరాజిల్లుతున్న శ్రీ శ్యామలాంబ ఆలయంలో చండీమహాయాగ సహిత శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు శ్యామలాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ VNK శేఖర్ పర్యవేక్షణలో ఘనంగా జరుగుతున్నాయి.

అయిదో రోజు శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మీదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పిచ్చికల సూర్యనారాయణ, రాణి దంపతులు పుష్పాలంకరణ చేయించారు. సుమారు 104మంది దంపతులు అమ్మవారికి ఉభయదాతలు, 26 మంది దంపతులు చండీహోమ పూజలు నిర్వహించారు. బచ్చు.నాగ వెంకట మురళీకృష్ణ, వరదా. వెంకట శివరామకృషకషోర్, కంచర్ల. రామకృష్ణ, చిట్టూరి. వెంకటరమేష్, నాగనబోయిన. నాంచారయ్యలు భక్తులకు ఉచిత ప్రసాదం అందించారు.

అనంతరం ఆవకూరుకు చెందిన బి.సుబ్బలక్ష్మి గురువు ఆధ్వర్యంలో మురళీకోలాటం నిర్వహించారు. తదుపరి విజయవాడకు చెందిన రేడియో & టీడీ ఆర్టిస్టు పి.లక్ష్మీలీలా భాగవతారిణి నిర్వహించిన హరికథా గానం భక్తులను అలరించింది.

రాత్రి 9 గంటలకు కలిదిండి బాబూరావు సమర్పణలో నిర్వహించిన రామాంజనేయయుద్ధంలో వార్ సీను, సత్యహరిశ్చంద్ర నాటకంలోని కాటిసీను, గోయోపాఖ్యానంలోని వార్ సీను త్రిముఖ సీనులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ VNK శేఖర్ లు పర్యవేహించారు.
నేడు లలితా త్రిపురసుందరీ దేవిగా శ్యామలాంబ :
శ్రీశ్యామాలంబ అమ్మవారి ఆలయ క్షేత్రంలో నిర్వహిస్తున్న శ్రీ దేవిశరన్నవరాత్రి ఉ త్సవాల్లో రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న శ్యామలాంబ అమ్మవారు శనివారం లలితా త్రిపురసుందరీ దేవిగా ధర్శనం ఇవ్వనున్నట్టు ఆలయ ఈఓ శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.