ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

స్థానిక కైకలూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కూటమి నేతలు, అభిమానులు నడుమ మంగళవారం ఘనంగా జరిగాయి.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా.. నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబీ) సహకారంతో.. ASN చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంకును ప్రారంభించి.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ కామినేని మాట్లాడుతూ.. ప్రజా సేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించి.. ఎదిగే కొద్ది ఒదిగిన మనిషి మన పవన్ కళ్యాణ్ అన్నారు. అయన తీసుకున్న ప్రతి శాఖకు వన్నె తెచ్చే విధంగా పరిపాలిస్తూ.. ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్నారని.. వారి జీవనవిధానాన్ని సేవలను కొనియాడారు.
ఈ వేడుకలో మాజీ శాసనమండలి సభ్యుడు కమ్మిలి విఠల్ రావు, NDA నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.