కైకలూరులో ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ
ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు పట్టణంలోని శ్రీవాసవి ఆక్వా రైతుబజారు, ఏ టు జెడ్ ఆక్వా బజారు మరియు ఏ టు జెడ్ ఆక్వా గోడౌన్ ను శనివారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రి సెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. స్టాకు రిజిస్టర్లను,స్టాకుగోడౌన్ ను పరిశీలించి స్టాకు రిజిస్టరు ప్రకారం సరుకును పరిశీలన చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ఎరువుల సరఫరాపై ముఖ్యంగా యూరియా సరఫరాపై ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందని,అలాగే రైతులకు నానో యూరియా మరియు నానో డిఏపి గురించి రైతులకు అవగాహన కల్పించి వారితో వినియోగించాలని తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా అక్వా దూకాలను కూడా తనిఖీ చేయడం జరిగిందని, అక్వా సాగులో ఎరువుల వినియోగం గురించి అక్వా రైతులను వివరాలు అడిగి తెసులుకోవడం జరిగిందన్నారు.
రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరా చేయవలసిందిగా మరియు వ్యవసాయేతర అవసరాలకు యూరియా వినియోగాన్ని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం యూరియాను అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని మరియు వ్యవసాయాధికారులు యూరియాని అవసరం మేరకు దఫదఫాలుగా రైతులకు సరఫరా చేయటానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు.
ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, యూరియాను వ్యవసాయేతర అవసరాలు వినియోగించకుండా అక్రమ రవాణాను నివారించుటకు అంతర జిల్లా మరియు అంతర రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.అటువంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.
కార్యక్రమంలో ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, అగ్రికల్చర్ జెడి షేక్ హబీబ్ భాష,డిడి బి.నర్సయ్య, వ్యవసాయ సహాయ సంచాలకును పార్వతి, తహాశీల్దారు యం.డి.ఇబ్రహీం, ఇన్చార్జి యంపిడివో ఆర్.ఫణీంద్ర, రైతు బజారు నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

