The Desk…Kaikaluru : వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు కొల్లేరు, ఉప్పుటేరులో వేటకు వెళ్లొద్దు : మత్స్యకారులకు ఎమ్మెల్యే కామినేని విజ్ఞప్తి

The Desk…Kaikaluru : వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు కొల్లేరు, ఉప్పుటేరులో వేటకు వెళ్లొద్దు : మత్స్యకారులకు ఎమ్మెల్యే కామినేని విజ్ఞప్తి

ఏలూరు జిల్లా : కైకలూరు/మండవల్లి : ది డెస్క్ :

భారీ వర్షాల కారణంగా ఎగువ నుండి కొల్లేరుకు వరద నీరు ఉధృతంగా చేరుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం తగ్గే వరకు మత్స్యకారులు కొల్లేరు, ఉప్పుటేరులో వేటకు వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

మండవల్లి మండలం శివారు పెద ఎడ్ల గాడి వద్ద ఎమ్మెల్యే కామినేని ఆదేశాల మేరకు ఆయన సొంత నిధులతో భారీగా పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగింపు పనులు జరుగుతున్నాయి.

యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిన ఈ పనులు రెవిన్యూ, డ్రైనేజీ మరియు పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ప్రోక్లైన్లతో పగలు, రాత్రి పనులు కొనసాగుతున్నాయి. ముంపు నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని.. కొల్లేరు లంక గ్రామాలు మరియు లోతట్టు గ్రామాల ప్రజలు ఆధైర్యపడోద్దన్నారు.

ఇదే క్రమంలో కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు లు సంయుక్తంగా ఉప్పుటేరుపై రైల్వే బ్రిడ్జి మరియు ఆకివీడు వంతెనల వద్ద భారీగా పేరుకుపోయిన కిక్కిస, గుర్రపుడెక్క తొలగింపు పనులు పర్యవేక్షణ చేపట్టారు.