The Desk…Kaikaluru :: గోవులను వాటి యజమానులే సంరక్షించుకోవాలి.. రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు : కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని హెచ్చరిక

The Desk…Kaikaluru :: గోవులను వాటి యజమానులే సంరక్షించుకోవాలి.. రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు : కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని హెచ్చరిక

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

దైవంగా భావించే గోమాతలను వీధులలో విడిచిపెట్టకుండా గోవులను వాటి యజమానులే సంరక్షించుకోవాలని.. వీధులలో విడిచిపెట్టి గోవులకు, అలాగే వాహనదారులకు ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవాలని ఏపీ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్రికా ముఖంగా పలుమార్లు గోవుల యజమానులను హెచ్చరించినా.. వాటికి రోడ్లపైకి విడిచి పెడుతూనే ఉన్నారని.. వీధుల్లో సంచరించే ఆవుల వల్ల వాటికి, అలాగే వాటి వల్ల వాహనదారులకు గాయాలయ్యి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు.

కొన్ని కొన్ని సందర్భాలలో గోవులకు వాహనాల వల్ల తీవ్ర గాయాలు అవుతున్నాయని.. అంతేకాక ప్రాణాలను సైతం కోల్పోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎక్కువ సందర్భాలలో గోవుల వల్లే ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు సంభవించాయని కామినేని వివరించారు. ఇటీవల గోవులు అడ్డుగా రావటం వలన ఇద్దరు యువకులు ప్రమాదంలో మరణించారన్నారు.

అందుచేతనే రోడ్లపై సంచరించే గోవులను కైకలూరు రైతు బజార్ ఎదురుగ ఉన్న బందెల దొడ్డిలో పెట్టడం జరిగినదనీ.. ఎవరైతే గోవుల యజమానులు వున్నారో వారు వచ్చి తమ గోవులను మొదటి తప్పుగా రూ.1000/- చెల్లించి ఇంటికి తీసుకువెళ్లాలన్నారు. మరొకసారి గోవులను రోడ్లపై విడిచిపెడితే గోశాలలకు తరలిస్తామని కామినేని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి *గో రక్షణ కమిటీ.. గో మాతలను అనాధగా వదిలేయకూడదు* అని ఒక కమిటీని పెడుతున్నామన్నారు.

ఈ కమిటీలో సభ్యులుగా కైకలూరు ఎంపీపీ అడవి వెంకట కృష్ణ మోహన్, వైస్ ఎంపీపీ మంగినేని రామకృష్ణ, కైకలూరు సర్పంచ్ KVNM నాయుడు, మానవతా సేవ సంస్థ సభ్యులు కొండ్రెడ్డి సత్యనారాయణ లతో ఈ నలుగురు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందన్నారు. కమిటీతో పాటు పంచాయితీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వెటర్నరీ సిబ్బంది అందురు కలిసి ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో NDA నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.