The Desk…Kaikaluru : వేగంకన్న ప్రాణమే మిన్న.. వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి : పోలీసు, రవాణా శాఖ అధికారులు

The Desk…Kaikaluru : వేగంకన్న ప్రాణమే మిన్న.. వాహనాలు నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించాలి : పోలీసు, రవాణా శాఖ అధికారులు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

వాహనాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని.. వేగం కన్నా.. ప్రాణమే మిన్న అని కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డి.ఎస్.పి శ్రావణ్ కుమార్ సూచనలతో, కైకలూరు రూరల్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు, కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి మండలాల SI లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ తో కలసి 4 మండలాల లో ఉన్న స్కూల్ బస్సులను తనిఖీ చేశారు.

ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, పోలీస్ సిబ్బందితో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు స్కూల్ బస్సు డ్రైవర్లకుస్కూల్ బస్సు నడిపే డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు.

రవాణా శాఖ అధికారులు ప్రతి ఒక్క స్కూల్ బస్సు ఫిట్నెస్ను క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలను నడిపేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.రవికుమార్, కలిదిండి, మండవల్లి, కైకలూరు రూరల్, ముదినేపల్లి ఎస్ఐ లు, వాహన తనిఖీ అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.