ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

కలిదిండి మండలం కలిదిండికి చెందిన ఎన్ఆర్ఐ బొంతు బోయిన లెనిన్ బాబు, దంపతులు 1 కోటి రూపాయలతో నిర్మించిన స్మశాన వాటికను సోమవారం రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, దాతలతో కలసి ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. పీ4 వినూత్న కార్యక్రమాన్ని దేశం అంతా మన రాష్ట్రం వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో 15 లక్షలు, ఏలూరు జిల్లాలో 75 వేలు బంగారు కుటుంబాలను దాతలు సహకారంతో దత్తత కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.

పీ4 లో భాగంగా ఆర్థికంగా స్థిరపడిన ప్రతి ఒక్కరూ దిగువ తరగతి వాళ్లకు చేయోతనిచ్చి ఆర్థికంగా బలోపేతం చెయ్యాలని కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దొంతుబోయిన లెనిన్ బాబు దంపతులను మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, గ్రామస్తులు కలిసి దాతలను ఘనంగా సత్కారం చేశారు.
కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు,మాజీ శాసన సభ్యులు గంటా మురళీ రామకృష్ణ, దొంతుబోయిన లెనిన్ బాబు దంపతులు వారి బంధు మిత్రులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.