ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో అనేకమంది నిరాశ్రయులై జీవనోపాధి కోల్పోయారు. ఈనేపథ్యంలో వారికి తన వంతు అండగా నిలిచి ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ, కైకలూరు మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ తన నెల జీతాన్ని బాధితులకు అందించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విరాళాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
