The Desk…Kaikaluru : కూటమి పై విష ప్రచారం మానుకోవాలి : స్థానిక వైసిపి కి జనసేన నేత కొల్లి బాబి హితవు

The Desk…Kaikaluru : కూటమి పై విష ప్రచారం మానుకోవాలి : స్థానిక వైసిపి కి జనసేన నేత కొల్లి బాబి హితవు

ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఐకమత్యాన్ని, ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసిపి మాజీ ఎమ్మెల్యే ఓ పత్రికలో “కూటమిలో కుమ్ములాట” అని అసత్య కథనాలు ప్రచురించి విష ప్రచారం చేస్తున్నారని కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకుడు కొల్లి వరప్రసాద్ (బాబి) తెలిపారు.

గురువారం కైకలూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కొల్లి వర ప్రసాద్ (బాబి) మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఘర్షణ తనను కలిచివేసిందని, యువత క్షణికావేశంలో టిడిపి నాయకులు మాల్యాద్రి షాపు వద్ద గొడవ పడటాన్ని తప్పు పట్టారు.

దీనిపై మాల్యాద్రికి మరియు టిడిపి నేతలకు జనసేన తరుపున బాబి మీడియా ద్వారా క్షమాపణ చెప్పారు. ఈ ఘర్షణ పార్టీల మధ్య జరిగిన వైరం కాదని.. ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగిందని.. అటువంటి ఘర్షణను ఓ పత్రిక “జనసేన, టిడిపి కుమ్ములాట” అని రాయడం అవహేళన చర్యని భావించారు. వైసీపీ రాజకీయం ముగిసిన అధ్యాయమని.. వారి అసత్య ఆరోపణలను నమ్మే రోజులు లేవన్నారు.

మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ మీరు ఓడిపోయారని.. ఇంట్లో పడుకోవాలని సవాల్ విసిరారు. కైకలూరులో డిఎన్ఆర్ పై రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నామని.. జగనన్న గ్రీన్ విలేజ్ పక్కన 60,70 ఎకరాలు అక్రమంగా కొనుగోలు చేశారని.. అంతేకాకుండా రేషన్ బియ్యం స్కామ్ లో కూడా ఉన్నారని.. రుజువు చేసి త్వరలో చట్టపరమైన విచారణను జరిపిస్తామని బాబి హెచ్చరించారు.

ప్రస్తుతం మట్టి టిప్పర్లు హైవే పనుల నిమిత్తం నియోజకవర్గం దాటకుండా సెస్ కట్టి మైనింగ్ చేస్తున్నామని, మీకు లాగా బినామీల పేర్లు పెట్టి అక్రమంగా మైనింగ్ చేయట్లేదని పేర్కొన్నారు. కొల్లేరు మరియు నామినేటెడ్ పదవులపై మాట్లాడారు.

కార్యక్రమంలో జనసేన వీర మహిళ తోట లక్ష్మి, సొంటి రాజేశ్వరి, బోయిన రాజేష్, పుప్పాల సూర్య ప్రకాష్, తులసి పూర్ణ, మోరు విజయ కుమార్, తదితరులు పాల్గొన్నారు.