The Desk…Kaikaluru : రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా లంకా రత్నారావు ప్రమాణస్వీకారం

The Desk…Kaikaluru : రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా లంకా రత్నారావు ప్రమాణస్వీకారం

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :

రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలానికి చెందిన లంకా రత్నారావు పదవీప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా రత్నారావును కూటమి ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పదవీప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘాలవారు, పలువురు కూటమి నేతలు రత్నరావుకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్.సదాశివ, విజయవాడ ఎంపి కేశినేని చిన్ని, టిటిడి బోర్డు సభ్యుడు వైద్యం శాంతారావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.