ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :
కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం సంతోషపురం కు చెందిన మాజీ ఎంపిటిసి కాల్వ నల్లయ్యను ప్రీ ప్లాన్ గా హత్య చేసిన నిందితుని కలిదిండి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఏలూరు డిఎస్పి డి. శ్రావణ్ కుమార్ తెలిపారు. కైకలూరు రూరల్ సర్కిల్ కార్యాలయం నందు సీఐ వి. రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి హత్యకు గల కారణాలను డి.ఎస్.పి మీడియాకు వివరించారు.
ఆయన తెలిపిన వివరాలు ప్రకారం.. కలిదిండి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి, మాజీ ఎంపీటీసీ కాల్వ, నల్లయ్య (55) కలిదిండిలో నివాసం ఉంటూ సంతోషపురం గ్రామంలో చేపల చెరువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం మోటార్ సైకిల్‌పై కలిదిండి వస్తుండగా.. సంతోషపురం – భోగేశ్వరం రోడ్డులో సంతోషపురం గ్రామానికి చెందిన హత్యా నిందితుడు పాతకక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం మోటార్ సైకిల్‌తో హతుడు నల్లయ్యను ఢీకొట్టి.. ఇనుప రాడ్‌తో తలపై కొట్టి కత్తితో దాడి చేశాడు. దీంతో నల్లయ్యకు తీవ్ర రక్త గాయాలై కుప్పకూలిపోయాడు. నిందితుడు వెంటనే అక్కడి నుంచి పరారు కాగా.. దారిన వెళ్లేవారు నల్లయ్య కుమారుడుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న హతుడు నల్లయ్య కుమారుడు ఆంజనేయులు కారులో కలిదిండిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రధమ చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకువెళ్లాడు.
అక్కడ చికిత్స పొందుతూ నల్లయ్య గురువారం సాయంత్రం మృతి చెందినట్టు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలిదిండి ఎస్పై వెంకటేశ్వరావు కేసు నమోదు చేశారు. నిందితుడు ను 19వ తేదీ మద్యాహ్నము అతని ఇంటివద్ద అరెస్టు చేసి, నేరమునకు ఉపయోగించిన ఇనుప రాడ్, కత్తిని దర్యాప్తు లో భాగంగా స్వాధీనపర్చుకున్నారు. చురుకుగా దర్యాప్తు చేసి అతి తక్కువ సమయములో కేసు ను ఛేదించి నిందితుని అరెస్టు చేసిన కైకలూర్ రూరల్ సీఐ వి.రవి కుమార్, వారి సిబ్బంది ని డిఎస్పి డి. శ్రవణ కుమార్ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సై రామచంద్రరావు, రూరల్ ఎస్సై వి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.