The Desk…Kaikaluru : కైకలూరులో పీఎం విశ్వకర్మ యోజన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన లంకా రత్నారావు

The Desk…Kaikaluru : కైకలూరులో పీఎం విశ్వకర్మ యోజన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన లంకా రత్నారావు

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK NEWS :

స్థానిక విద్యాంజలి కళాశాల ఆవరణలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ ను తెదేపా నాయకుడు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లంక రత్నారావు మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని చేతివృత్తి దారులైన నాయి బ్రాహ్మనులు, అలాగే ప్రతి చేతి వృత్తిదారుడు ఈ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందాలన్నారు. అలాగే, ట్రైనింగ్ సెంటర్ వారు జారీ చేసే సర్టిఫికెట్ ఆధారంగా ప్రభుత్వ బ్యాంకు లోన్ లకు అర్హత పొందే అవకాశం లభిస్తుందని.. దేశ ప్రధాని ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రతి చేతి వృత్తిదారుడు వినియోగించుకోవలసినదిగా కార్పొరేషన్ డైరెక్టర్ లంకా రత్నారావు కోరారు.

కార్యక్రమంలో నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు కొత్తపల్లి విజయకుమార్, మలువల అచ్చా రావు, కొత్తకోట స్వామి, మాటూరి పండు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సోదరులు తదితరులు పాల్గొన్నారు.