- అవగాహన సదస్సులో పట్టణ, రూరల్ సిఐలు.. కృష్ణ… రవి కుమార్
ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు ఎంతగానో దోహదపడతాయని కైకలూరు పట్టణ, రూరల్ సిఐలు కె. కృష్ణ, వి.రవికుమార్ లు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప శివకిశోర్, ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కైకలూరు పట్టణ, రూరల్, మండవల్లి, ముదినేపల్లి పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న GMSK మహిళా పోలీసులకు, ప్రజలకు కైకలూరులో గురువారం సిసి కెమెరాల ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కైకలూరు పట్టణ.. రూరల్ సిఐలు కృష్ణ . రవికుమార్ లు మాట్లాడుతూ.. ప్రజలకు సీసీ కెమెరాలు ఉంటే కలిగే లాభాలను గురించి వివరిస్తూ.. ఒక సీసీ కెమెరా ఒక ఏరియాలో ఉంది అంటే పదిమంది పోలీస్ వారి నిఘా ఉన్నట్టేనన్నారు.
సీసీకెమెరాల అమరిక మన ఇంటి వైపు కాకుండా వీధి వైపు కవరయ్యేలగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, దాని వలన ఏదైనా కేసు దర్యాప్తులో చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని సీసీ కెమెరా అందిస్తుందని, ఆధునిక సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నట్లు సమయం కాని సమయంలో అపరిచితులు మన ఇంటి చుట్టుపక్కల సంచరించిన సమయంలో మనకు మన ఫోనుకు అలర్టును పంపుతుందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే ప్రజలు దాని వైఫై కనెక్షన్ ను పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేస్తే పోలీసుల పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు.
ఎంతో ఖర్చు పెడుతూ ఉంటామని అతి తక్కువ రేట్లకు వచ్చే సీసీ కెమెరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కెమెరాల విలువ ప్రజల పోగొట్టుకునే వాటికంటే ఎంతో తక్కువ రేట్లో ఉంటుందని, ప్రజలు సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని, ఏదైనా నేరం జరిగిన తర్వాత బాధపడే కంటే నేరాలు జరగకుండా కాపాడుకోవాలంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ అవసరమని ప్రజలకు సీసీ కెమెరాలు ఉపయోగాలను గురించి వివరించారు. సదస్సులో కైకలూరు పట్టణ, రూరల్, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.