The Desk… Kaikaluru : కైకలూరులో ఘనంగా పొట్టి శ్రీరాములు “ఆత్మార్పణ దినోత్సవం”

The Desk… Kaikaluru : కైకలూరులో ఘనంగా పొట్టి శ్రీరాములు “ఆత్మార్పణ దినోత్సవం”

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా “ఆత్మార్పణ దినోత్సవం” ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పోరేషన్ డైరెక్టర్ పి.జె.ఎస్ మాల్యాద్రి ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కైకలూరు ప్రధాన రహదారిపై కూటమి నేతలు, నియోజకవ్గ ఆర్య వైశ్యులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాల్యాద్రి బైక్ పై కమ్మిలి విఠల్ రావు బైక్ ర్యాలీ లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం గాంధిబొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు, గాంధీ విగ్రహాలకు స్థానిక శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కృతజ్ఞతా సభలొ పాల్గొని పొట్టి శ్రీరాములు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని..ఇటువంటి త్యాగం ఎవరూ చేయలేనిదని, తెలుగు వారందరికీ ఆరాధ్యుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. నిర్వాహుకులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో తాడినాడ బాబు, ఎండి రహీమ్, పోలవరపు లక్ష్మీ రాణి, లక్కెంశెట్టి మోహన్, జనసేన నాయకుడు కొల్లి బాబి, నల్లగోపుల చలపతి, తోట లక్ష్మీ, ఆర్యవైశ్యులు, ఎన్డీఏ నాయకులు, అద్దేపల్లి బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/o4nJ8YsVaTw