ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
అక్రమంగా మద్యం కలిగి ఉండి బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కైకలూరు రూరల్ పోలీసులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పోలీసు తెలిపిన వివరాలు ప్రకారం… కైకలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు ఆలపాడు గ్రామంలో అక్రమంగా బెల్టు షాప్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఓ వ్యక్తి పై ఆకస్మిక దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుండి 11 క్వార్టర్ బతిళ్ళ ను స్వాదినం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.