The Desk… Kaikaluru : అనారోగ్యంతో బాధపడుతున్న కైలాషికి నేషనల్ స్కూలు సాయం వెలకట్టలేనిది : ఎమ్మెల్యే డా. కామినేని

The Desk… Kaikaluru : అనారోగ్యంతో బాధపడుతున్న కైలాషికి నేషనల్ స్కూలు సాయం వెలకట్టలేనిది : ఎమ్మెల్యే డా. కామినేని

  • ఎమ్మెల్యే డా. కామినేని చేతుల మీదుగా రూ.3.51 లక్షల చెక్కు అందజేత

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

అనారోగ్యంతో వెంటిలేటర్పై ఉన్న నేషనల్ స్కూలు విద్యార్ధిని భట్రాజు భూపిక కైలాషికి స్కూలు విద్యార్ధులు, యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం అందించిన సాయం వెలకట్టలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ కొనియాడారు.

నేషనల్ స్కూల్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న భట్రాజు భూపిక కైలాషి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో తీవ్ర అనారోగ్యంతో హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా వైద్యసేవలు పొందుతూ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంది. కైలాషి తండ్రి భట్రాజు ధర్మరాజు డ్రైవర్ గా పని చేస్తున్నారు.

వారిది పేద కుటుంబం. కైలాషి ఆరోగ్యానికి ఇప్పటికే రూ.25 లక్షలు ఖర్చు చేశారు. ఆర్ధిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా తమ శక్తికి మించి రూ.25 లక్షలు వరకు ఖర్చుచేసినా ఇంకా పూర్తిస్థాయిలో ఆమె కోలుకోలేదు.

దీంతో భట్రాజు భూపిక కైలాషికి సాయం చేయాలనే ఆలోచనతో నేషనల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తమవంతు సాయమందించటంతోపాటు విద్యార్థులు పలువురి నుంచి విరాళాలు సైతం సేకరించి రూ. 3..51లక్షలు సమీకరించారు.

సదరు మొత్తాన్ని శనివారం ఉదయం స్కూలు వద్ద కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయాలని కోరుతూ కైకలూరు నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడు కరేటి శ్రీహరికి స్కూలు విద్యార్ధులు, స్కూలు కరస్పాండెంట్ గురజాడ చంద్రమోహన్ దంపతులు అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ..

అనారోగ్యంతో ఉన్న చిన్నారి కోసం తోటి విద్యార్ధులు స్పందించిన తీరుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని కొంచెం మెరుగ్గా ఉందని, తాను ప్రతిరోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నానని, చిన్నారులంతా ఇంత పెద్ద మొత్తంలో తోటి విద్యార్ధిని ఆరోగ్యం కోసం సాయమందించటం నిజంగా ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. మీ అందరి ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో కైలాషి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ అందరి మధ్యకు వస్తుందని, ఆ నమ్మకం తనకు ఉందని, మీ ఆశీస్సులే ఆమెకు ఊపిరిపోస్తాయన్నారు.

తల్లిదండ్రుల ఆశయాల సాధనకు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్దగా విని బాగా చదువుకుని మీరంతా ఉన్నతస్థాకియి చేరుకోవాలని ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఆఆకాంక్షించారు. కాగా, మంచి మనసుతో, మానవత్వంతో సాయం అందించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం తరపున కరస్పాండెంట్ గురజాడ చంద్రమోహన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గురజాడ చంద్రమోహన్ దంపతులతోపాటు, ఎంపిపి అడివి వెంకటకృష్ణమోహన్, వైస్ ఎంపిపి ఎండి జహీర్, పట్టణ సిఐ కృష్ణ, ఎన్డీఎ కూటమి నాయకులు పూల రామచంద్రరావు (రాజీ), కొల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు.