The Desk… Kaikaluru : “అన్న” క్యాంటీన్లో సేనాధిపతి అన్నదానం

The Desk… Kaikaluru : “అన్న” క్యాంటీన్లో సేనాధిపతి అన్నదానం

ఏలూరు జిల్లా, కైకలూరు : The Desk : నియోజకవర్గ కేంద్రం కైకలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావుల సూచన మేరకు డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 68వ రోజుకు చేరింది.

ఆదివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఎపియుడబ్ల్యుజె) రాష్ట్ర కోశాధికారి, ‘సేన’ తెలుగు దినపత్రిక అధినేత అద్దంకి వెంకట శ్రీనివాసరావు, అద్దంకి శివనాగేశ్వరరావు లు తమ మాతృమూర్తి దివంగత అన్నపూర్ణమ్మ ద్వితీయ వర్థంతిని పురస్కరించుకుని సుమారు 400 మందికి అన్నదానం నిర్వహించారు.

అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ తల్లి పేరున పేదలకు అన్నదానం చేసిన అద్దంకి సోదరులు శ్రీనివాసరావు, నాగేశ్వరరావులను అభినందించారు.

అనంతరం దాత ఎ.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నేడు మా మాతృమూర్తి అన్నపూర్ణమ్మ ద్వితీయ వర్థంతిని పురస్కరించుకుని ఆమె పేరున పేదలకు అన్నదానం చేశామన్నారు. అన్నిదానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, మా తల్లి పేరున అన్నదానం చేసి పేదలకు ఆకలి తీర్చడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

కార్యక్రమంలో దాతలు అద్దంకి వెంకట శ్రీనివాసరావు, అద్దంకి శివనాగేశ్వరరావు, అద్దంకి వెంకట రాజేష్ (చిట్టి), అద్దంకి విజయ్ ప్రశాంత్ (పండు)లతోపాటు కైకలూరు ఎంపిటిసి మంగినేని రామకృష్ణ, టిడిటి వడ్డి సాధికార కమిటీ చైర్మన్ బలే ఏసురాజు, తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పూల రామచంద్రరావు (రాజీ), కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ (బాబీ), తులసి పూర్ణ, పుప్పాల సూర్యప్రకాష్, బొక్కా వెంకట్రావు, అద్దంకి రమేష్ రాజు, రామాయణం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.