మండవల్లి , ముదినేపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.* హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కమిలి విఠల్ రావు.
ఏలూరు జిల్లా : మండవల్లి/ముదినేపల్లి : THE DESK :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే అభివృద్ధిలో మార్పు చూపిస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
మండవల్లి, ముదినేపల్లిలో శనివారం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కమ్మిలి విఠల్ రావు పాల్గొన్నారు.
నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు డిసెంబరులో, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభించడానికి తమ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని ఎంపీ తెలిపారు.
జల్ శక్తి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీరు అందించడానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు ఎంపి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత రాష్ట్రంలో యువనేత నారా లోకేష్, ఏలూరు పార్లమెంటు పరిధిలో తాను బాధ్యతలు తీసుకున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మంత్రువర్యులు నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు ముందుకు వస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు పెంచడంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని ఎంపీ సూచించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన జాబితాలో కైకలూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవాలని శ్రేణులకు ఎంపీ విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తలు, నాయకులు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎంపీ సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అధికారులతో కలిసి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.