The Desk… Kaikaluru : మద్యం బెల్ట్ షాపులపై కైకలూరు పట్టణ, రూరల్ పోలీసుల ఉక్కు పాదం

The Desk… Kaikaluru : మద్యం బెల్ట్ షాపులపై కైకలూరు పట్టణ, రూరల్ పోలీసుల ఉక్కు పాదం

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

చట్ట విరుద్ధంగా అక్రమ మద్యం అమ్మకాలు జరుపుతున్న బెల్ట్ దుకాణాలపై కైకలూరు పట్టణ, రూరల్ పోలీసులు ఏకదాడులు చేస్తూ ఉక్కు పాదం మోపుతున్నారు.

జిల్లా ఎస్పీ K.శివ ప్రతాప్ కిషోర్ ఉత్తర్వుల మేరకు, డీఎస్పీ D. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో, కైకలూరు టౌన్ సీఐ కృష్ణ ప్రసాద్, రూరల్ సీఐ రవికుమార్ లకు రాబడిన సమాచారం మేరకు గురువారం కైకలూరు టౌన్ ఎస్సై D. వెంకట్ కుమార్, కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు లు తమ సిబ్బంది తో కలసి మద్యం బెల్టు దుకాణాలపై దాడులు చేశారు.

కైకలూరు టౌన్లో….

పట్టణ ఎస్ఐ డి వెంకట్ కుమార్ అక్రమ మద్యం కలిగి ఉండి విక్రయిస్తున్న వ్యక్తి స్థానిక మార్కెట్ యార్డు సమీపంలో అరెస్టు చేసి అతని వద్ద నుండి 22 మద్యం సీసాలును స్వాధీనపర్చుకుని నిందితుని పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ఎస్సై వెంకట్ కుమార్ తెలిపారు.

కైకలూరు రూరల్ లో….

అదేవిధంగా… కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు మండలంలోని పల్లెవాడ గ్రామంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని సమాచారంతో బెల్టు దుకాణంపై దాడి చేయగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తి పట్టుపడ్డాడు. అతని వద్ద నుండి 80 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై తెలిపారు.