ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
కైకలూరు ప్రధాన రహదారి పై శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో లారీ ఢీకొని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది.
కైకలూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కోరుకొల్లు రోడ్డులో నివాసం ఉంటున్న మృతురాలు తెల్లబోయిన పల్లవి (15) ఆటపాక లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.
ప్రతిరోజు స్కూలు తర్వాత కైకలూరు ప్రధాన రహదారి సమీపంలో కుమారి టాకీస్ దగ్గరలో ప్రైవేటుకు వెళ్లి వస్తూ ఉంటుంది. రోజూలానే శనివారం ప్రైవేటు నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో టౌన్ హాల్ సమీపంలో సైకిల్ చక్రం రాయిని ఢీకొంది.
దీంతో సైకిల్ అదుపుతప్పి పల్లవి రోడ్డుపై పడిపోగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కైకలూరు టౌన్ పోలీసులు తెలిపారు.