ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
మండలంలోని చటాకాయ గ్రామంలో చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులపై దాడి జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామని కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు.
సమావేశంలో సిఐ రవికుమార్ మాట్లాడుతూ.. చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కలిసి విచక్షణారహితంగా వారిపై దాడి చేశారన్నారు. దాడిలో ఇద్దరు వ్యక్తులకు చేతులు విరగగా… మరో వ్యక్తి కనిపించని గాయాలయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై అదే గ్రామానికి చెందిన సైదు రఘు అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్తో 18 మందిపై కైకలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కైకలూరు రూరల్ ఎస్సై నిందితులను అరెస్టు చేయగా వారిలో ప్రధాన నిందితులైన ఆరుగురును కైకలూరు జె ఎఫ్ సి ఎం కోర్టు కు రిమాండ్ నిమిత్తం తరలించామన్నారు.