ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
మైనర్ బాలిక ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారయత్నం చేసిన ఓ వ్యక్తిని కైకలూరు టౌన్ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్టు కైకలూరు టౌన్ ఎస్ఐ డి. వెంకట్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం…
కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను కైకలూరు మండలం ఒక గ్రామానికి చెందిన సుగుణరావు అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా.. సదరు బాలిక భయంతో కేకలు కేకలు వేసింది. దీంతో నిందితుడు సుగుణరావు అక్కడి నుండి పారిపోయాడు. విషయాన్ని సదరు బాలిక సాయంత్రం ఇంటికి వచ్చి తన తల్లికి చెప్పగా.. తన తల్లి స్పృహ తప్పి పడిపోవటం వల్ల, తరువాత తన తండ్రికి చెప్పింది.
దీంతో ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం రాత్రి కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. సదరు రిపోర్టుపై కైకలూరు టౌన్ ఎస్సై డి. వెంకట్ కుమార్ ఫోక్సో కేసు నమోదు చేసి నీందితుడు సుగుణరావు ను శనివారం అరెస్టు అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం కైకలూరు కోర్టులో హాజరుపరిచామని ఎస్సై తెలిపారు.