The Desk…Kaikaluru : శ్రీ పెద్దింటి అమ్మవారి కానుకల హుండీ ఆదాయం రూ.9.07లక్షలు

The Desk…Kaikaluru : శ్రీ పెద్దింటి అమ్మవారి కానుకల హుండీ ఆదాయం రూ.9.07లక్షలు

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం నందు కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది.

సోమవారం ఉదయం 10 గం.లకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తనిఖీ అధికారి, పోలీసు, రెవిన్యూ, ఆలయ సిబ్బంది, భక్తుల సమక్షంలో శ్రీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకల హుండీలను తెరిచి లెక్కించారు.

121 రోజులకు గాను రూ.9,07,104 లు నగదు ఆదాయంగా వచ్చిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి కూచిపూడి శ్రీనివాసు ఓ ప్రకటనలో తెలిపారు.