ఏలూరుజిల్లా : కైకలూరు : THE DESK :
మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పెట్టుకుని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు.
మండలంలోని వేమవరప్పాడు, వింజరం, ఆచవరం గ్రామాల్లో “పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు” భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణంకు ఆదివారం కైకలూరు శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాజీ శాసనమండలి సభ్యుడు కమ్మిలి విఠల్ రావు తో కలసి భూమి పూజ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ.. అనుకున్న రీతిలోనే కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పదంవైపు నడిపిస్తుందన్నారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తూ నిధులను మంజూరు చేస్తుందని..దీంతో ఏడాది గడిచేలోపే గ్రామాల రూపురేకలు మారిపోతాయన్నారు.
ఈ అభివృద్ధి చూసి గత ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కార్యక్రమం లో NDA కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.