ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరులో APUWJ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఏ.వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ముందుగా యూనియన్ జండా ఆవిష్కరించారు. APUWJ ఆవిర్భావం నుంచి నేటి వరకు చేసిన ఉద్యమ పోరాటాల గురించి నాయకులు పాత్రికేయులకు వివరించారు. అనంతరం కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నందు రోగులకు రొట్టెలు, పండ్లు యూనియన్ నాయకులు, సభ్యులు చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జియోజకవర్గ పాత్రికేయులు పాల్గొన్నారు.
