ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
క్రమశిక్షణ కలిగిన సమాజం కోసం అంతరాలు లేని సమ సమాజ స్థాపన కోసం శ్రమించి నిస్వార్థ చింతనతో జ్ఞానాన్ని పంచే ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ఆనందదాయకమని స్థానిక జాగృతి విద్యాసంస్థల అధినేత, ప్రిన్సిపాల్ పానేం కిషోర్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శనివారం రాజమండ్రిలోని ఆనంద రెసిడెన్సి హాల్లో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి ఎడ్యుకేషనల్ స్పెషల్, గోదావరి టాలెంట్ టెస్ట్, రాజమండ్రి రౌండప్ సాయంకాల పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదర్శ గురువులకు సత్కార కార్యక్రమంలో “గురుబ్రహ్మ” పురస్కారాలను జాగృతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉపాధ్యాయ అధ్యాపక బృందం అందుకోవడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న వారిలో ప్రిన్సిపాల్ పానెం జయ కిషోర్ బాబు, తెలుగు ఉపాధ్యాయులు బి. నాగరాజు, గణిత ఉపాధ్యాయులు ఎం. వర ప్రసాద్, ఆంగ్ల ఉపాధ్యాయులు బి. నాగసతీష్ లు ఉన్నారు.