The Desk…Kaikaluru : శ్రీ పెద్దింట్లమ్మ ఆలయ ఈఓ గా కే. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

The Desk…Kaikaluru : శ్రీ పెద్దింట్లమ్మ ఆలయ ఈఓ గా కే. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరణ

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

మండలంలోని కొల్లేటి కోటలో కొలువైయున్న శ్రీ పెద్దింటి అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి గా కూచిపూడి శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చమిచ్చి ఆహ్వానించారు.

ఈఓ శ్రీనివాస్ హనుమాన్ జంక్షన్ లోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించి, శ్రీ పెద్దింట్లమ్మ ఆలయానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

ఇప్పటివరకు ఈ ఆలయంలో విధులు నిర్వహించిన కార్యనిర్వాహణాధికారి గోపాలరావు కృష్ణా జిల్లాలోని గుడివాడలో గల శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి బదిలీపై వెళ్లారు.