ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
కైకలూరు రూరల్ CI గా వి. రవి కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఏలూరు ట్రాన్స్కో విజిలెన్స్ అధికారిగా విధులను నిర్వర్తిస్తూ… కైకలూరు రూరల్ సర్కిల్ కు బదిలీపై వచ్చారు.
ఈ సందర్భంగా సీఐ విలేకరులతో ములాఖాత్ ఏర్పాటుచేసి కాసేపు ముచ్చటించారు.
గతంలో కైకలూరు సీఐ గా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించి ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… కైకలూరు రూరల్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
అలాగే, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా అట్టి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.