ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :
స్థానిక కోరుకొల్లు రోడ్డులో గల జాగృతి విద్యాసంస్థల యాజమాన్యం ఆధ్వర్యంలో కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు సోమవారం నిత్యవసరాలు అందజేశారు.
ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు నుంచి నీరు కొల్లేరులోకి భారీగా చేరడంతో నియోజకవర్గంలోని లంక గ్రామాలు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు జలదిగ్బంధంలో ఉండిపోయారు.
దీంతో కొల్లేరు గ్రామాల ప్రజలకు జాగృతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో తమ వంతు సాయంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం సంయుక్తంగా కలిసి కొల్లేరు ముంపు గ్రామాలను స్వయంగా సందర్శించి వారికి సాయంగా కాయగూరలను అందించారు.
ఈ సందర్భంగా జాగృతి విద్యాసంస్థల అధినేత పానెం జయ కిషోర్ మాట్లాడుతూ.. నిత్యం మాతో అనుబంధాన్ని పంచుకుంటున్న లంక గ్రామాల ప్రజలు పరిస్థితి ఎంతో దయనీయమైన స్థితిలో ఉన్నదని, దాదాపు పది రోజులు పైబడి లంక గ్రామాల ప్రజల యొక్క జనజీవనం స్తంభించిందని,
ఈ నేపథ్యం దృష్ట్యా తమ వంతు సాయంగా ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు యాజమాన్యం తెలిపింది. సాయం అందించిన జాగృతి విద్యాసంస్థల యాజమాన్యానికి లంక గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.