The Desk …Kaikaluru :  కైకలూరు మీడియా ఔదార్యం… ఆపన్నులకు అండగా మీడియా

The Desk …Kaikaluru : కైకలూరు మీడియా ఔదార్యం… ఆపన్నులకు అండగా మీడియా

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK :

వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సహాయం

ఎమ్మెల్యే కామినేనికి అందజేసిన నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు

వరద బాధితులను ఆదుకునేందుకు కైకలూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని శుక్రవారం కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా నందు స్థానిక ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ కు అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మీడియా మిత్రులు వరద బాధితులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని ప్రశంసించారు.

అనంతరం మీడియా మిత్రులు మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ పిలుపు మేరకు కైకలూరు నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి మేము సైతం అంటూ రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరేలా ఎమ్మెల్యేకి అందజేసినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సేనా దినపత్రిక ఎడిటర్ అద్దంకి శ్రీనివాసరావు, పాత్రికేయులు పెద్ది సురేష్, జి సర్వేశ్వరరావు, గొర్తి రాధాకృష్ణ, ఘంటసాల దుర్గారావు, అంకెం రాము,జొన్నలగడ్డ నాగరాజు, వాసే పౌల్ రాజ్, శాంతరాజు, కే సుమంత్, రమేష్, బి సీతారామయ్య, చావలి శంకర్ శాస్త్రి, విజయ్, వై శ్రీనివాసరావు, హరి ప్రసాద్, భూషణం, గుడివాడ గణేష్, పేర్రాజు, వాసు, స్టాలిన్, కిషోర్, అబ్రహం, రాజేష్, సత్యనారాయణ, శశికాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.