The Desk…Kadiyam : బాలయ్య దాతృత్వం… కడియపులంక చిన్నారికి బాలకృష్ణ వైద్య సహాయం

The Desk…Kadiyam : బాలయ్య దాతృత్వం… కడియపులంక చిన్నారికి బాలకృష్ణ వైద్య సహాయం

తూ.గో జిల్లా : కడియం మండలం : THE DESK NEWS : కడియపులంక గ్రామానికి చెందిన చిన్నారి అనారోగ్యానికి గురవడంతో ప్రముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైద్య సహాయం అందించారు. వివరాల్లోకి వెళితే… బుర్రిలంక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హర్షదీప్ మొక్కల కుండీల సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ పాండే కుమార్తె ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఈ విషయాన్ని జనసేన నాయకులు రత్నం అయ్యప్ప ద్వారా రాష్ట్ర పర్యాటక,సంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించారు. దుర్గేష్ స్పందించి బాలకృష్ణకు తెలియజేసి వైద్య సహాయం అందించాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సిఫార్సు చేశారు. అంతేకాదు మెరుగైన అత్యాధునిక వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. స్వయంగా బాలకృష్ణ హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించి వైద్యులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.