- కామంతో కొట్టుకుంటున్న జిల్లా రవాణా శాఖ అధికారి
- మహిళా అధికారిణిపై లైంగిక వేధింపులు..‼️
- కోరిక తీర్చాలంటూ ఇంటికెళ్లిన జిల్లా “రవాణాశాఖ అధికారి”
- విషయం తెలిసి చితకబాదిన బాధితురాలి భర్త
🔴 కడప : THE DESK NEWS :
జిల్లా రవాణాశాఖలో ఓ కీచక అధికారి కామంతో కార్యాలయ మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న ఘటన గురువారం వెలుగులోకి..
కామంధుడి వేధింపులకు ఇటీవల ఓ అధికారిణి బదిలీపై వెళ్లిపోగా, మరో అధికారిణికి వాట్సప్ లో అసభ్యకర సందేశాలు పంపుతుండడంతోపాటు తన కోరిక తీర్చాలంటూ బలవంతం చేస్తున్న వైనం..
నన్ను ఇబ్బంది పెట్టొద్దని, మీ కుమార్తె కంటే చిన్నదానినని, నన్ను వదిలేయాలని బ్రతిమలాడిన మహిళా ఉద్యోగి
ఈ నేపథ్యంలో అధికారిణి భర్త ఉద్యోగరీత్యా పక్క జిల్లాలో పనిచేస్తున్నట్లు తెలుసుకున్న సదరు అధికారి గురువారం ఉదయం నేరుగా ఆమె ఇంటికెళ్లిన వైనం..
దీంతో ఆమె సీసీ కెమెరాల్లో అతడి రాకను గమనించి భర్తకు ఫోన్ ద్వారా సమాచారమివ్వగా..
సీసీ కెమెరాలను తన ఫోన్ కు అనుసంధానించుకున్న ఆమె భర్త కామాంధుడైన అధికారి చేష్టలు గమనించి… తలుపు తడుతూ మహిళా అధికారిణి పిలిచే ప్రయత్నం చేయగా ఆమె స్పందించలేదు.
కొంత సేపు ప్రయత్నించిన అధికారి ఆమె ఇంటి ముంగిటే కూర్చున్నారు. ఇవన్నీ గమనించిన అధికారిణి భర్త ..అధికారికి ఫోన్ చేయగా.. స్పందించ కుండా అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేసిన అధికారి…
వెంటనే పక్క జిల్లా నుంచి తిరిగి వచ్చి అధికారిణి భర్త భార్యను వెంటబెట్టుకుని కార్యాలయానికి వెళ్లి కీచక అధికారిని చితకబాదారు.
దీంతో బాధితురాలి కాళ్లపై పడి వేడుకోవడంతో వదిలిపెట్టారు. ఈ వ్యవహారం బయటకు రాకుండా రక్షించాలని అధికారి ఉద్యోగులు, సిబ్బందిని వేడుకున్నారు.
బాధి తురాలితో పాటు అమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తనను ఆదుకో వాలని ప్రాధేయపడ్డారు.
గతంలో బాపట్ల లోనూ ఇలాంటి కార్యకలాపాలే సాగించినట్లు సదరు అధికారిపై ఆరోపణలు.
www.thedesknews.net