కడప జిల్లా : THE DESK : సింగిల్ విండో విధానంతో గణేష్ ఉత్సవాల అనుమతులు సులభంగా పొందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక పోర్టల్ ద్వారా అనుమతులు పొందవచ్చునని కడప జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అనుమతి పొందే విధానం :
గణేష్ ఉత్సవ కమిటీలు 7995095800 మొబైల్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా Hi అని మెసేజ్ పంపితే నిరభ్యంతర పత్రం (ఎన్.ఓ.సి) కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్ ఫోన్ కు వస్తుంది. ఆ తరువాత ఉత్సవ కమిటీలు ganeshutsav.net అనే వెబ్ సైట్ లో గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటీ సభ్యుల వివరాలు, మంటపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు. ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారనే వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ (S.H.O)కు వెళ్తుంది. ఎస్.హెచ్.ఓ (S.H.O) ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల సిబ్బంది ఒక బృందంలా ఏర్పడి మండపం ఏర్పాటు చేయు ప్రదేశమును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సానుకూలంగా ఉంటె QR కోడ్ తో కూడిన నిరభ్యంతర పత్రం జారీ చేస్తారు. అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియచేస్తారు. నిర్వాహకులు వారికీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం లో తగిన రుసుము చెల్లించి రశీదును వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎస్.హెచ్.ఓ (S.H.O) గారు వాటిని పరిశీలించి వెంటనే నిరభ్యంతర పత్రమును జారీ చేస్తారు. ఈ నిరభ్యంతర పత్రాన్ని ప్రింట్ తీసి గణేష్ మంటపం లో ఉంచాలి. పోలీస్ వారు సందర్శన సమయంలో QR కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.