The Desk…K Pentapadu : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

The Desk…K Pentapadu : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛమైన గాలి” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

🔴 ప.గో జిల్లా : పెంటపాడు మండలం : K పెంటపాడు : ది డెస్క్ :

కే పెంటపాడు గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమములో భాగంగా.. క్లీన్ ఎయిర్ ..వాయు కాలుష్యం నివారణ పై ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు… కాలుష్యం వలన వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తెలియజేస్తూ. పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్యవంతమైన పరిపాలన అందించాలని ఉద్దేశంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమష్టిగా మంచి సంకల్పంతో.. పర్యావరణాన్ని కాపాడి, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందాలంటే మొక్కలు నాటాలని… కాలుష్యం లేకుండా ఉండాలంటే డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తెచ్చారు.

వీటిని వినియోగించడం వలన పొల్యూషన్ తగ్గి స్వచ్ఛమైన గాలి అందరికీ అంతటా వ్యాపిస్తుంది కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుంది. EV వెహికల్స్ వినియోగంతో ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.. కాబట్టి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి ప్రతి ఒక్కరు వినియోగించుకుని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ ఏడుకొండలు, HM రామకృష్ణ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.