The Desk…K.Pentapadu : “స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర”.. “స్వచ్ఛత హై సేవ” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

The Desk…K.Pentapadu : “స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర”.. “స్వచ్ఛత హై సేవ” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

🔴 ప.గో జిల్లా : పెంటపాడు మండలం : K పెంటపాడు : ది డెస్క్ :

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో… స్థానిక గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” మరియు “స్వచ్ఛత హై సేవ” గ్రీన్ ఏపీ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా.. విద్యార్థులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, తడిచెత్త – పొడిచెత్త మీద అవగాహన కల్పించారు. అనంతరం వారిచేత ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు , సర్పంచ్ పీతల సత్యనారాయణ, ఎంపీటీసీ ఏడుకొండలు, పెంట్లమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, జనసేన నాయకులు నరాల శెట్టి సంతోష్, విద్యార్థులు, ప్రభృతులు పాల్గొన్నారు.