🥛 ప.గో జిల్లా : తాడేపల్లిగూడెం నియోజకవర్గం :

శ్రీరామ నవమి సందర్భంగా కస్పా పెంటపాడు గ్రామంలోని బైరాగి మఠంలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద జరిగిన సీతారామచంద్రమూర్తి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకుని, సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించి, విశేష పూజలు నిర్వహించిన బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..
సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగడం చాలా సంతోషమని.. ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా స్వామి వారికి దుస్తులు సమర్పించడం జరిగిందని మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో.. అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

కార్యక్రమంలో తోట రాజా, నరాలశెట్టి సంతోష్ , గంధం సతీష్ , పంతం శేఖర్, గ్రామ సర్పంచ్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, కాజులూరి మల్లేశ్వరరావు, చేపల రమేష్ , కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కాళ్ళ గోపికృష్ణ , అడ్డగర్ల సూరి, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, మద్దాల మణి కుమార్, బైనపాలెపు ముఖేష్, గట్టిం నాని, సందాక రమణ, యర్రంశెట్టి శ్రీనివాస్, దంగేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.