🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :
పార్లమెంట్ లో అమరావతి రాజధాని చట్టబద్దతపై ఆమోదం లభించడంపై జిల్లాలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సంతోషంతో వారి ఇళ్ల వద్ద, అధికారులు కార్యాలయాల వద్ద అంబరాన్ని అంటేలా సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లను, అధికారులు తమ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించుకోవడం, కేకులు కట్ చేసే ఆనంద సంబరాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ అమరావతి రాజధానిగా చట్టబద్దతకు ఆమోదం తెలియజేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయమంటూ…
జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో… అన్ స్టాపబుల్ అమరావతి… జై అమరావతి అంటూ ఫ్లకార్డులతో – కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ మరియు సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Amaravati Capital Status Sparks Joy in Jangareddigudem Sub-Registrar’s Office
Jubilation erupted across Eluru district after Parliament approved Amaravati as the state’s capital, granting it legal status. Residents lit up homes with electric lights, burst crackers, and cut cakes in celebration. Officials illuminated offices and joined the festivities.
At Jangareddigudem Sub-Registrar’s Office, staff chanted “Unstoppable Amaravati” and “Jai Amaravati” with placards, slicing a cake amid cheers. The Sub-Registrar and team exchanged congratulations, hailing the decision as historic.

