🔴 ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :
సంక్రాంతి సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వచ్చే ప్రయాణికులకు విజ్ఞప్తి :
పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే వారు మన రాష్ట్రానికి మద్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ తీసుకురావద్దు.
అలా మీరు తీసుకుని వచ్చిన యెడల ఏపీ ఎక్సైజ్ చట్టానికి బాధ్యులుగా పరిగణించబడతారు.
ఎక్సైజ్ శాఖ చట్టం దృష్ట్యా అది నేరము – దయచేసి అలాంటి పని ఎవరు చేయవద్దు.
మద్యాన్ని వాహనం ద్వారా తీసుకువస్తే ఆ వాహనం కూడా జప్తు చేసి మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది.
కావున హ్యాపీగా సంక్రాంతి జరుపుకుందాము.. తిరిగి మీ ప్రాంతాలకు క్షేమంగా సంతోషంగా తిరిగి వెళ్లాలి.
ఏలూరు ఎక్సైజ్ శాఖకు సహకరించండి..

