🔴 ఏలూరు జిల్లా : ఏలూరు/జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :

గత నెల కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యములో రాష్ట్రవ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న విషయము పాఠకులకు తెలిసినదే.

దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో కలపర్రు టోల్గేట్ మరియు జంగారెడ్డిగూడెం పట్టణములో ఆర్టీవోలు ఎస్.బి.శేఖర్ మరియు ఎస్.ఎస్.రంగనాయకులు పర్యవేక్షణ లోని మోటార్ వాహనాల తనిఖీ అధికారుల ప్రత్యేక బృందాలు ప్రైవేట్ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై సోమవారం నుంచి శుక్రవారం రాత్రి వరకు 72 కేసులు నమోదు చేసినట్లు ఉపరవాణా కమిషనరు షేక్ కరీమ్ శనివారం తెలియచేశారు.
7,65,230 రూపాయలు అపరాధరుసుము విధించగా, 4,50,100 రూపాయలు ఇప్పటి వరకు వసూలు అయినట్లు ఆయన తెలిపారు.
సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ లిస్టు లేని మరియు తదితర ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు ప్రతి రోజూ కొనసాగుతాయని డీటీసీ కరీమ్ తెలిపారు.

