ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : THE DESK :
వరదలు, భారీ వర్షాల దృష్ట్యా ఏలూరు జిల్లా, బుట్టాయిగూడెం మండలం, కామవరం గ్రామంలో వెలసిన శ్రీ గుబ్బల మంగమ్మ ఆలయాన్ని ఆదివారం (08.08.24)న దర్శించుకోవద్దని జంగారెడ్డిగూడెం ఆర్డీవో కె.అద్దయ్యయ శనివారం భక్తులకు విజ్ఞప్తి చేశారు. భక్తులు తమ పర్యటన వాయిదా వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
భారీవర్షాలు రెడ్ అలెర్ట్ ప్రకటించినందున ఏజెన్సీ ప్రాంతంలో అనేక వాగులు పొంగి పొర్లే అవకాశం ఉన్నందున, ఆదివారం భక్తులు ఆలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయానికి వెళ్లే రహదారులు, రెండు ప్రధాన ద్వారాలు మూసివుంచడం జరుగుతుందని, ఆలయంలోకి ప్రవేశం లేదని తెలిపారు.