The Desk…Jangareddigudem : “స్త్రీ శక్తి” ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో  ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‎‎

The Desk…Jangareddigudem : “స్త్రీ శక్తి” ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్‎‎

🔴‎ ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : ది డెస్క్ :

జంగారెడ్డిగూడెం బస్సు డిపో దగ్గర “స్త్రీ శక్తి” ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

ఈసందర్భంగా కార్యక్రమానికి హాజరైన మీడియాను, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..

చంద్రబాబు నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 తో పాటు అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆర్ధిక సమస్యలు ఉన్నా ఇప్పటికే దాదాపు 90 శాతం హామీలను అమలు చేసిందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సంక్షేమ పథకాలతో పాటు, పరిశ్రమలు పెట్టిస్తూ చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నామన్నారు.‎

అధికారంలోకి రాగానే పెన్షన్ 4 వేలకు పెంచామని, ‎పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్ లను పునరుద్ధరించామని, గత ఏడాది అక్టోబర్ నుంచి పేదలకు ఏటా 3 గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకం అమల్లోకి తీసుకువచ్చాం. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి 20 వేలకు పెంచాం.  మొన్న ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించి, తొలి విడతగా 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7 వేలు చొప్పున 3 వేల కోట్లకు పైగా జమ చేయడం జరిగింది.

అంతకుముందు తల్లికివందనం పథకాన్ని కూడా అమలు చేసి, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13 వేలు చేయడం జరిగిందని, ఇంటికి ఒకరికి కాదు, మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మంది పిల్లలకు ఒక్కొక్కరికీ 13 వేల చొప్పున ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అని చెప్పారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.‎ తాజాగా ఇప్పుడు మహిళలకు అందిస్తున్న మరో వరం “స్త్రీ శక్తి ” ఉచిత బస్సు పథకం అని, బస్సులో కండక్టర్ కి మీ ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు ఏదైనా చూపించి రాష్ట్రంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణం చెయ్యొచ్చు అని ఎంపీ పుట్టా మహేష్ స్పష్టం చేశారు. 

ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ సహా 5 రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యొచ్చని ఎంపీ వెల్లడించారు. అవకాశాన్ని రాష్ట్రంలోని మహిళలంతా ఉపయోగించుకొని, సురక్షిత ప్రయాణాలు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.‎ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎంపీ అయిన తర్వాత ఏలూరు పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభ్రివృద్ది పనుల గురించి ఎంపీ గుర్తుచేసారు.

పోలవరానికి  కేంద్ర నిధులు విడుదల, వందేభారత్ ట్రైన్ కి ఏలూరులో హాల్టు, రైల్వే క్రాసింగుల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏలూరు పరిసర ప్రాంతాల ప్రజల కోసం 12 రైలు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు.‎

గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన  అనేక రహదారులను నిర్మించుకున్నాం. కరెంట్, తాగునీరు వంటి సమస్యలు ఎక్కడ నా దృష్టికి వచ్చినా స్పందించి సమస్యను పరిష్కరిస్తున్నామని, ఈ ప్రాంత ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొవ్వూరు – భద్రాచలం రైల్వే లైన్ డీపీర్ రెడీ చేయించాం, పనులు కూడా త్వరలో మొదలవ్వబోతున్నాయన్నారు.

‎అలాగే కోకో, పొగాకు, పామాయిల్, కొల్లేరు రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని, సీలింగ్ తొలగించి రైతులు అధికంగా పండించిన పొగాకును విక్రయించుకోవడానికి కేంద్ర వాణిజ్య మంత్రి గారితో మాట్లాడి ఒప్పించడం జరిగిందని,  ఆయిల్ పామ్ కు ఫిక్స్డ్ ధరను నిర్ణయించి రైతులను ఆదుకునేందుకు కూడా ఢిల్లీ లో ప్రయత్నిస్తున్నానని ఎంపీ వివరించారు.

‎ఈ విధంగా సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు చేపడుతూ మన ఏలూరు నియోజకవర్గాన్ని ఉత్తమ లోక్ సభా నియోజకవర్గంగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న నాకు ఎల్లప్పుడూ  మీ ఆశీస్సులు అందించి ఆశీర్వదించాలని పుట్టా మహేష్ కోరారు.

కార్యక్రమంలో ఎంపీతో బాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసరావు, ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు.‎