The Desk …Jaggampet : 11 నెలల చిన్నారితో తండ్రి ఆత్మహత్యాయత్నం…కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సిఐ సూర్య అప్పారావు

The Desk …Jaggampet : 11 నెలల చిన్నారితో తండ్రి ఆత్మహత్యాయత్నం…కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న సిఐ సూర్య అప్పారావు

🔴 కాకినాడ జిల్లా : జగ్గంపేట :

జగ్గంపేటకు చెందిన సాయమ్మకు ఏడాదిన్నర క్రితం జగ్గంపేట టవర్ కాలనీ ప్రాంతానికి చెందిన మణికంఠతో ప్రేమ వివాహం జరగగా, వీరికి 11 నెలల కుమార్తెతో నివసిస్తున్నారు.

భార్యాభర్తలిద్దరికి తరుచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో.. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో 11 నెలల తన కుమార్తెను మోటార్ బైక్ పై ఎక్కించుకుని జగ్గంపేట శివారు గుర్రంపాలెం దారిలో గల పోలవరం కాలువలోకి మోటర్ బైక్ తో పాపతో సహా కాలువలోనికి వెళ్ళిపోగా.. స్థానికులు రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ పాప చనిపోగా.. తండ్రిని సురక్షితంగా రక్షించారు. జగ్గంపేట ఎస్సై కేసు నమోదు చేయగా.. సిఐ సూర్య అప్పారావు పర్యవేక్షిస్తున్నారు.