🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

పెనుగంచిప్రోలు గోపయ్య సమేతలక్ష్మీ తిరుపతమ్మ తల్లి పరివార దేవతల ప్రబల రంగుల మహోత్సవం జగ్గయ్యపేటలో బయలుదేరి పెనుగంచిప్రోలుకు తిరుగు ప్రయాణంలో భాగంగా.. రూట్ మ్యాప్ మరియు బందోబస్తు నిర్వహించుటకు స్థానిక జగ్గయ్యపేట సిఐ.. చిల్లకల్లు, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు ఎస్సై ఆధ్వర్యంలో దాదాపు 80 మంది పోలీస్ సిబ్బందితో వాగ్దేవి మహిళా కళాశాలలో యాక్షన్ ప్లాన్ రూపొందించి AI ఆధారిత జాగ్రత్త డిజిటల్ స్కిన్ ద్వారా సిబ్బందికి తగు సూచనలు చేశారు.
పోలీస్ సిబ్బందికి పూర్తిగా అర్థమయ్యే విధంగా జగ్గయ్యపేట, చిల్లకల్లు, భీమవరం, లింగగూడెం మీదుగా పెనుగంచిప్రోలుకు చేరే త్రిపుర తిరుపతమ్మ తల్లి ప్రబల రంగుల మహోత్సవ కార్యక్రమం సంబంధించి పూర్తి బందోబస్తు జాగ్రత్తలను డిజిటల్ స్క్రీన్ పై వాగ్దేవి మహిళా కళాశాలలో సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్ పాల్గొన్నారు.
Jaggayyapet Police Conduct Action Plan at Vagdevi Women’s College.
Jaggayyapet CI Chillakallu, along with Chillakallu and Penuganchiprolu SIs, led around 80 police personnel in an action plan at Vagdevi Women’s College for the vibrant procession of Tripura Tirupatamma Amma Devi, starting from Jaggayyapet en route to Penuganchiprolu via Gopayya Samethalakshmi. Using AI-based digital skin screens, they detailed route maps, bandobust measures, and precautions through Jaggayyapet, Chillakallu, Bhimavaram, and Lingagudem. College Principal Dr. Bussa Suresh participated.

