🔴 NTR జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :
పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ కార్యక్రమంలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న 50 మంది విద్యార్థినులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ తెలిపారు.
AGS హెల్త్ మల్టి నేషనల్ కంపెనీలో మెడికల్ కోడింగ్ సాఫ్ట్వేర్లుగా విద్యార్థినులు ఎంపికయ్యారని మొత్తం 80 మంది విద్యార్థులు పాల్గొనగా 50 మంది రెండు లక్షల నుండి రూడు లక్షల వరకు ప్యాకేజీతో సెలెక్టు అయ్యారని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ బుస్సా సరిత ఆధ్వర్యంలో ఈకార్యక్రమం జరిగిందని తెలిపారు.