🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

స్థానిక వాగ్దేవి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కళాశాలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలపై జరిగిన కార్యక్రమంలో.. CDPO లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ.. నేడు పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉన్న కోర్సుల లో విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని తద్వారా మంచి ఉద్యోగాలు పొందవచ్చునని అన్నారు.
స్కిల్ ట్రైనింగ్ ఒకేషనల్ కోర్సెస్ గురించి కళాశాల ప్రిన్సిపాల్ బుస్సా సురేష్ మాట్లాడుతూ…ఆడపిల్లలు ఈ వోకేషనల్ కోర్సులు స్కిల్ కోర్సులు చదవటం వల్ల రెండు సంవత్సరాల్లోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు 100% పొందవచ్చని వివరించారు.
వాగ్దేవి కళాశాలలో ఎం పి హెచ్ డబ్ల్యు నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్ వెటర్నరీ సైన్స్ కంప్యూటర్ సైన్స్ వంటి ఒకేషనల్ కోర్సులను ప్రభుత్వం అందించే ఫీజు రియంబర్స్మెంట్ తో అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కోర్సుల వల్ల నూటికి నూరు శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని కళాశాల తరఫున ఇవ్వటం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ K.ఉషారాణి, SK బి బి జాన్, K సువర్ణ శారద మరియు విద్యార్థులు పాల్గొన్నారు.