ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ : ది డెస్క్ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా నేడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన డీజీపీ గారికి విజయవాడ పోలీస్ కమిషనర్ (CP) Sri Raj Seaker Babu దుర్గా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో డీజీపీ దంపతులను ఆహ్వానించి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, ఆలయ వేద పండితులు డీజీపీ కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందజేశారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) డీజీపీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం జ్ఞాపికను (అమ్మవారి ఫోటో) అందజేశారు.
కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం పశ్చిమ మండల ఇన్‌చార్జ్ డీసీపీ గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఐ గున్నం రామ్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు

