🔴 విజయవాడ : ఇంద్రకీలాద్రి : ది డెస్క్ :

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేడు లలిత త్రిపరసుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ద్వారక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ వి ఎస్ ఎన్ మూర్తి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… వెంకటేశ్వర స్వామికి సోదరి అయిన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని చెప్పారు. ప్రధానాచార్యులు పిఏ సింగరాచార్యులు, వేద పండితులు వెంకటేశ్వర శర్మ తదితరులతో కలిసి పట్టు వస్త్రాలను, సారెను సమర్పించినట్లు తెలిపారు.

అక్టోబర్ 2 తారీఖు నుంచి 10 పదవ తేదీ వరకు ద్వారకాతిరుమల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఆరవ తేదీన కళ్యాణం, ఏడవ తేదీన రథోత్సవం జరుగుతాయని తెలిపారు.